మనవుడి జీవన విధానం ఎలా ఉండాలి?
విశ్వం నిరంతరం ఒకానొక క్రమత్వాన్ని అనుసరించి పరిభ్రమిస్తోంది. ఇట్టి చలనము వల్లనే విశ్వము తన ధర్మంలో స్థితి పొంది, దైవాజ్ఞకు అనుగుణంగా మనుగడ కలిగివుంది.
సూర్యచంద్రుల వలె, గ్రహ నక్షత్రాల వలె మానవ జీవన విధానం సైతం లోకమునకు క్షేమము కలుగు సత్కర్మలలో నిమగ్నమై ఉండవలెను. మానవ జీవిత లక్షము సుఖాన్వేషణ కాదు. నిజమైన శాంతి మరియు ఆనందము పొందుటకు మానవులు నిరంతరం శుభకర్మలు చేయుట యందు తమ విలువైన కాలాన్ని వెచ్చించాలి. పనికి మాలిన వనులను, మాటలను మరియు చేతలను విడిచివేయాలి.
ఎప్పుడైతే సద్భుద్దితో మానవులు కర్మలను మనసా వాచా కర్మణా ఏకచిత్తులై శ్రద్ధతో ఆచరింతురో, తమ జీవిత అవనరాలకు కావలసినవన్నీ భగవంతుడిచే ఏర్పాటు చేయబడును.
స్వార్ధము, పేరాశ, దొంగదారి మానవులను పతనము చేయును. విశ్వ రహస్యాలను తమ ప్రతిభతో దర్శించిన ఋషులు శ్రేష్టమైన జీవన విధానానికి తమ బోధనలచే పూలబాటలు వేసినారు.
0 Comments